నా మొదటి తెలుగు టపా (My First Telugu Post)
ఏన్నో రోజులనుండి అనుకుంటున్నాను తెలుగు లో రాయాలని, ఇప్పటికి తీరింది నా కొరిక.ముందుగా మిత్రులు రానారె గారికి ధన్యావాదాలు ,నాకు తెలుగు లో రాయడానికి ప్రేరన కలిపించినందుకు ,అలానే మిత్రురాలు లేఖిని కి కుడా ,నా స్వప్నాన్ని నిజం చేసినందుకు.
మొదటి ఉద్యోగం, మొదటి గడ్డం గీయడం ,మొదటి ముద్దు( ఏదో ప్రవాహం లో రాసాను, సుధాకర్ ఇంకా మంచి బాలుడే) లాగ మొదటి టప కుడా ఓక మధుర ఙ్నాపకంగా వుంచుకోవలంటే ఏమీ చేయ్యాలా అని ఆలోచిస్తుండగ, చించింది చాలు గాని ఏదొ ఓక పేరు పెట్టు మొదటగ, అని అన్నాడు నా లోని అంగ్ల బ్లాగరు(వాడికి నాకు అసలు పడదండి బాబు, ఇన్ని రోజులు గా తెలుగు లో ఏమి రాస్తవు, English లొ రాయు, నీ Profession కి కుడా ఉపయోగపడుతుంది అన్నాడు వాడు వెధవ, లేకపోతెనా..... ఈసారీ Indibloggies లో.... అగాండాగండి .....మొదటి బహుమతి గురుంచి కాదు నేను అంటున్నది, విహారి గారి సరసన చెరొచ్చని అంతె!!! (నా వోటు నాకే కద మరి)),మరి నేను (నా లొని తెలుగు బ్లాగరు అని కుడా చదువుకోవచ్చు) ఉరుకుంటానా..... రాయడం ప్రారంభించిన 21 రోజులకు కదా పేరు పెట్టెది....లైటు తీస్కో అని బదులీచ్చా, కాని వాడు ఏమన్నాడంటె...ఓరెయ్ పిచ్చి వెధవ, నీ తెలుగు బ్లాగర్ల సంగం లో అందరు ప్రవసాంధ్రులే... అమెరికా లో పుట్టిన వెంటనే పేరు పెడుతారు, అది కుడా తేలియదా? అని బంతిని నా కోర్టు లోకి నెట్టాడు.
తప్పుతుందా మరీ? ఇజ్జత్ కా సవాల్ అని, మళ్ళీ ఆలోచించడం మొదలేట్టా .... మొదటగ రానారె గారి శైలీ లో జెసారె అని పెడదమనుకున్నా, కానీ మరీ లీసారె లాగా ఉందని, కొద్దిగా మార్చి జెసుధ అని పెడ్దామనుకుంటుండగా... పదవ తరగతి లో మా తెలుగు ఉపద్యాయిని నా పేరు (జె సుధాకర్) ని జయసుధ అనీ కూనీ చెయ్యడం గుర్తుకు వచ్చి, సులభంగా సుధ తో సర్దుకుపోదామనుకుంటుండగా, ఆ పేరు తాలుకా పేటెంట్ హక్కులు డా.ఇస్మాయిల్ సొంతం అని గుర్తుకువచ్చి , విరమించుకున్నా. కాని ఏదో ఒక్కటి పెట్టాలీ కదా, జ్యోతి గారికి కాని మండిదంటే, సోది సుధాకర్(శోధన సుధాకర్ కు ప్రాస లాగా వుంటుందని) అని పేరు పేట్టినా పెట్టొచ్చు. దయచేసి నాకు ఏవరైనా సహాయం చెయ్యరు?
త.చు.(తప్పక చుడండి)
1)క్షమించాలి రానారె,విహారి,డా.ఇస్మాయిల్,శోధన మరియు జ్యోతి గార్లు , మీ అనుమతి లెకుండా మీ పేరు వాడినందుకు
2)నెను ఈ టపా నీ లేఖిని ఉపయొగించి రాసాను. దీనికంటె సులభమైన పద్దతి ఏదైనా వుందా?
Labels: telugu