నా మొదటి తెలుగు టపా (My First Telugu Post)
ఏన్నో రోజులనుండి అనుకుంటున్నాను తెలుగు లో రాయాలని, ఇప్పటికి తీరింది నా కొరిక.ముందుగా మిత్రులు రానారె గారికి ధన్యావాదాలు ,నాకు తెలుగు లో రాయడానికి ప్రేరన కలిపించినందుకు ,అలానే మిత్రురాలు లేఖిని కి కుడా ,నా స్వప్నాన్ని నిజం చేసినందుకు.
మొదటి ఉద్యోగం, మొదటి గడ్డం గీయడం ,మొదటి ముద్దు( ఏదో ప్రవాహం లో రాసాను, సుధాకర్ ఇంకా మంచి బాలుడే) లాగ మొదటి టప కుడా ఓక మధుర ఙ్నాపకంగా వుంచుకోవలంటే ఏమీ చేయ్యాలా అని ఆలోచిస్తుండగ, చించింది చాలు గాని ఏదొ ఓక పేరు పెట్టు మొదటగ, అని అన్నాడు నా లోని అంగ్ల బ్లాగరు(వాడికి నాకు అసలు పడదండి బాబు, ఇన్ని రోజులు గా తెలుగు లో ఏమి రాస్తవు, English లొ రాయు, నీ Profession కి కుడా ఉపయోగపడుతుంది అన్నాడు వాడు వెధవ, లేకపోతెనా..... ఈసారీ Indibloggies లో.... అగాండాగండి .....మొదటి బహుమతి గురుంచి కాదు నేను అంటున్నది, విహారి గారి సరసన చెరొచ్చని అంతె!!! (నా వోటు నాకే కద మరి)),మరి నేను (నా లొని తెలుగు బ్లాగరు అని కుడా చదువుకోవచ్చు) ఉరుకుంటానా..... రాయడం ప్రారంభించిన 21 రోజులకు కదా పేరు పెట్టెది....లైటు తీస్కో అని బదులీచ్చా, కాని వాడు ఏమన్నాడంటె...ఓరెయ్ పిచ్చి వెధవ, నీ తెలుగు బ్లాగర్ల సంగం లో అందరు ప్రవసాంధ్రులే... అమెరికా లో పుట్టిన వెంటనే పేరు పెడుతారు, అది కుడా తేలియదా? అని బంతిని నా కోర్టు లోకి నెట్టాడు.
తప్పుతుందా మరీ? ఇజ్జత్ కా సవాల్ అని, మళ్ళీ ఆలోచించడం మొదలేట్టా .... మొదటగ రానారె గారి శైలీ లో జెసారె అని పెడదమనుకున్నా, కానీ మరీ లీసారె లాగా ఉందని, కొద్దిగా మార్చి జెసుధ అని పెడ్దామనుకుంటుండగా... పదవ తరగతి లో మా తెలుగు ఉపద్యాయిని నా పేరు (జె సుధాకర్) ని జయసుధ అనీ కూనీ చెయ్యడం గుర్తుకు వచ్చి, సులభంగా సుధ తో సర్దుకుపోదామనుకుంటుండగా, ఆ పేరు తాలుకా పేటెంట్ హక్కులు డా.ఇస్మాయిల్ సొంతం అని గుర్తుకువచ్చి , విరమించుకున్నా. కాని ఏదో ఒక్కటి పెట్టాలీ కదా, జ్యోతి గారికి కాని మండిదంటే, సోది సుధాకర్(శోధన సుధాకర్ కు ప్రాస లాగా వుంటుందని) అని పేరు పేట్టినా పెట్టొచ్చు. దయచేసి నాకు ఏవరైనా సహాయం చెయ్యరు?
త.చు.(తప్పక చుడండి)
1)క్షమించాలి రానారె,విహారి,డా.ఇస్మాయిల్,శోధన మరియు జ్యోతి గార్లు , మీ అనుమతి లెకుండా మీ పేరు వాడినందుకు
2)నెను ఈ టపా నీ లేఖిని ఉపయొగించి రాసాను. దీనికంటె సులభమైన పద్దతి ఏదైనా వుందా?
Labels: telugu
12 Comments:
(శుభాకాంక్షలు సినిమాలోని 'ఉత్తముడైన గోపి' గుర్తుకొస్తున్నాడు) మంచిబాలుడైన సుధాకరునకు సుస్వాగతము. మీ మొదటి టపా బాగుంది. నాకు తెలిసి రానారె మీకు ఏ సహాయమూ చెయ్యలేదు. కానీ మీ ధన్యవాదాలు స్వీకరించడానికి మాత్రం ముందుంటాడు :) నాదొక చిన్న సలహా - మీలోని తెలుగుబ్లాగరును ఇంగ్లీషుబ్లాగరు ఇంటినుండి బయటకొచ్చి సొంత కుంపటి పెట్టించి కూడలిలో చేరమనండి. నేను మొదలెట్టింది మాత్రం లేఖినితోనే. అందుకు లేఖినికి కృతజ్ఞతలు. లేఖినిలాంటి ఏ ఉపకరణమూ లేకుండా నేరుగా తెలుగు టైపు చెయ్యడం నేర్చుకున్నానిపుడు. మీరు విండోస్ వాడుతున్నట్లైతే తెలుగు కీబోర్డ్ వ్యవస్థాపితం చేసి తెలుగును నేరుగా రాయడం సాధన చెయ్యండి. వారం రోజుల్లోగా మనం తెలుగులో ఛాటింగ్ చెయ్యొచ్చు.
మీరు మరొక సుధాకరా? . నేను సుధాకర్ నే. మీ లాగే ఈ మధ్యే తెలుగులో బ్లాగటం మొదలుపెట్టాను. నేను నా ఇంటిపేరుని నా user name గా వాడుతున్నాను. మీకు నచ్చితే మీరు కోడా మీ ఇంటిపేరు తో వ్రాయండి. మీ profile లో "Non NRI" పదం చూసి నవ్వాగ లేదు (please తప్పుగా అనుకోవద్దు) . Non X Non = Resident Indian అనా మీ ఉద్దేశ్యము.
"స్నిగ్ధ - విరుస్తున్న మొగ్గ" అనే పేరు మీ బ్లాగుకు నప్పుతుందా? మీకు నచ్చితే ఇది మీ బ్లాగుకు పెట్టవచ్చు. మీ పేరుకు match అయ్యెలా స తో మొదలయ్యేలా ఉందీ పేరు.
"సుధాసాగరం" ఎలావుంది.
ఒక్క జాబులో అందర్నీ టచ్ చేస్తూ పోయారుగా :-) సుస్వాగతం. నేను కూడా ఒకప్పుడు, ఇప్పుడూ ఆంగ్ల బ్లాగరునే. తెలుగు బ్లాగరును కూడా.నోటికొచ్చింది ఇక్కడ రాసుకుంటూ పోతే ఈ భాష అయితేనేం :-)
మీ పేరు విషయానికొస్తే...
మీ పేరు కోసం కాక మీ భావాన్ని ప్రతిబింబించే పేరు వుంటే బాగుంటుంది.
నేను కూడా ఒకప్పుడు పేరు పెట్టుకోవడానికి తంటాలు పడిన వాడినే (ఇది చదవండి: http://gsnaveen.wordpress.com/2006/11/14/pootareks/).నాగరాజుగారు నాగరాజుగారు నా బ్లాగులో వ్రాసిన ఒక పదాన్ని నీకు ఇచ్చేస్తున్నా ఫో..........."బ్లాగిలం"...దీనర్థం తెలియాలంటే ఈ పోస్టు నువ్వు చదవాల్సిందే: http://gsnaveen.wordpress.com/2007/02/24/nenevaru1/
శుభారంభం చేశారు.
" తెలుగు బ్లాగర్ల సంగం లో అందరు ప్రవసాంధ్రులే.." ఇది నిజం కాదు.
"రాగసుధ", "బ్లాగుసుధ" ఎలా వున్నాయి?
--ప్రసాద్
http://blog.charasala.com
నా అనుమతి లేకుండా నా పేరు పెట్టేసుకుని క్షమించాలి అంటారా? ఠాఠ్! క్షమించే సమస్యే లేదు. నా పేరు అంతర్జాతీయ చట్టాల ప్రకారం పేటెంట్ తీసుకోబడింది. దాన్ని ఉల్లంఘించిన వారు బ్లాగు రీత్యా నేరస్తులు. దీనికి శిక్ష వారం రోజులో పది బ్లాగులు లేదా పది బ్లాగులు ఏడు రోజుల్లో రాయాలి. లేకపోతే మీకు బ్లాగ్ఫాయిడ్ అనే రోగమొచ్చి వారం రోజులు కంప్యూటరుకు అతుక్కు పోతారు.
మీరు బాగానే మొదలు పెట్టారు.
పేర్లో నేమున్నది? "ఏడుకొండల వాడా" అని ఒక పేరు పెట్టేసుకోండి.
-- పేటెంట్ విహారి
రానారె గారు:
నా మొదతి టపా మీకు నచ్చినదని చెప్పినందుకు దన్యావాదములు.
మీరు ఏమి సహయం చేయ్యలేదు కాని మీరు తెలుగు లో టైప్ చెయ్యడం చూసి నేను ప్రెరన పొంది తెలుగు లో రాస్తున్నాను.
నేను కూడలి లో చేరాను, నేను తెలుగు లో రాస్తున్నాను. (నేను మర్గదర్శి లో చేరాను ....లాగ చదువుకొండి)
వల్లూరి గారు:
మీరు నవ్వు రాలేదని చెపితే తప్పుగా అనుకోనెవాడిని. నా ఉదెశ్యము అదే,కాని దానీ వెనకాల చాలా కథ వుంది. మీకు సమయం వుంటే ఈ లంక ను చదవండి.
http://kaizen123.blogspot.com/2006/11/pissed-off.html
నా బ్లాగు యొక్క పూర్వపు పేరు నా ఇంటి పేరుతొనె వుండేది ,కాని అలా వుండడం వలన నేను అనుకున్నవన్ని రాయలేకపొయాను.గుగుల్ సర్చ్ లో నా ఇంటి పేరు కొడితే నా బ్లగు లంకె వచ్చెది .అందువల్ల నా ఇంటి పేరు తిసేసాను.
ఇక్కడ చాలా మంది సుధాకర్ లను చుస్తున్నందుకు ఆనందంగా వుంది. చిన్నప్పుడు ప్రతి సినిమా లో గాని, నవల లో గాని హిరో పేరు సుధాకర్ వుంటుందేమో అని ఎదురుచుసేవాడిని.ప్రతి సారి నిరాశే ఎదురయ్యేది.
cbrao గారు:
"స్నిగ్ధ - విరుస్తున్న మొగ్గ" పేరు చాలా బాగుంది కాని ఆ పేరు కి న్యాయం చెస్తానన్న నమ్మకం లేదు. జ్యోతి గారు కుడా మీ పేరు నే బలపరిచారు(ఆర్కుట్ లో). నా బ్లాగు ని దర్షినందుకు క్రుతఘ్నతలు
రాధిక గారు:
సుధాసాగరం బాగుదండి. కాని జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళందరు ,హుస్సెన్ సాగర్ లో కాకుండ సుధాసాగరం లో దూకుతారామో?
"నీ బ్లాగు చదువుతూ హాయిగా చనిపొవాలనివుంది" లాంటి కామెంట్స్ నెను వినాలనుకొవడం లేదు
శొదన సుధాకర్ గారు :
పల్లుడకొట్టుకొవడానికి యె రాయి అయితే నెం ? అన్నంటుంది.
మీరన్నది నిజం ,నెను వెతుకుతున్నది కుదా అలాంటి పేరు కొరకే
మీ లాంటి పెద్ద బ్లాగరు నుండి కమెంట్స్ రావడం అద్రుశ్ఠంగ భావిస్తున్నాను
నవీన్ గారు:
గబ్బిలం కష్టాలు గబ్బిలం కు తెలుస్తాయంటే ఇదెనేమో
అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ,నాగరాజు గారి పదాన్ని మీరెస్తే ,నెనూ తిసుకోకుండా వుంటానా? కాని నాగరాజు గారి అనుమతి కావలేమో?
స్పందన గారు:
దన్యావాదములు
" తెలుగు బ్లాగర్ల సంగం లో అందరు ప్రవసాంధ్రులే.." ఇది నిజం కాదు. -- మంచి క్యాచ్, చాలా మంది అని రాయల్సింది అందరు అని రాసాను
రెండు పేర్లు బాగున్నాయి కాని ఒక పేరు డిసైడ్ చేస్తే ఇంకో పేరు ఫీల్ అవుతుందెమో?
పేటెంట్ విహారి గారు:
మొదటగ మీరు హస్యపురితమైన బ్లాగులు రాసి నన్ను బ్లాగు రాసెందుకు టెంప్ట్ చేసినందుకు, మీరే నాకు క్షమాపన చెప్పాలి. సరెలే చెల్లు.
మరి అంత పెద్ద శిక్ష నా? యెడు గంటల్లొ పది కామెంట్స్ రాయమంటె రాస్తను. సరేనా?
సుధాకరా...
బ్లాగులోకానికి సుస్వాగతం!అన్నట్టు నా సుధ నాకు పరిచయం కాక మునుపు నుంచీ సుధాకర్ పేరు గల మిత్రులు నాకు చాలా మంది.విచిత్రం ఏమిటంటే వారందరినీ సుధా అనే పిలిచేవాన్ని.
ఇక మీరన్న పేటెంటు హక్కులు లాంటివేమీ లేవండోయ్. మీ బ్లాగుకు 'సుధాకరం' అన్న పేరు ఎలా ఉందంటారు?(కాస్త పనుల్లో పడి ఆలస్యంగా రాయాల్సి వచ్చింది.)
-ఐ'స్మైల్'
Post a Comment
<< Home