ఇంకో రెండు రోజులు
"హెయ్ సుధాకర్ ,హౌ మెనీ మోర్ డేస్ యు హావ్?" అని అడిగాడు పాల్.
"టు మోర్ డేస్ అని చెప్పా వెంటనే" ,ఏ మాత్రం ఆలొచించకుండా
"వాట్ విల్ యు డు ఫస్ట్ అఫ్టర్ గోయింగ్ టు ఇండియా ?" అని అడిగాడు
నేను ఆలోచించడం మొదలేట్టా... ఉరికి వెళ్ళి అమ్మ నాన్నాలని కలవడం మొదటి పని .... ఇంకా అంటే, బావర్చి బిర్యాని తినడం ,పల్సర్ నడపడం ,మామిడి పండ్లతో అంబలి తాగడం, గిన్నెలు కడాగాల్సిన అవసరం లేకుండా బోజనం చేయ్యడం, కొత్త ఇంటికి వెల్లడం, చుట్టాలందరిని కలవడం .... ఇవన్ని ఒక వారం రోజులు.... కాని తరువతా ?
నెను ఇక్కడికి వచ్చెటప్పుడు వున్న ముగ్గురు కజిన్స్ అమెరికా వెల్లిపోయారు.ఇంకో కజిన్ ,కుందన్ గాడు ఇండియా కి రావడం ,మల్లీ అమెరికా కి వెల్లిపొవడం కుడా జరిగిపొయింది. మిగిలిన ఎకైకా కజిన్ గాడు కుడా H1 అంటున్నాడు.ఇండియా ట్రిప్ కని వచ్చిన సందీప్ గాడు అమెరికా , రాజ్ గాడు అస్త్రేలియా వెల్లిపొబొతున్నారు, ఏప్రిల్ మొదటి వారం లో .(ఇప్పటికే ఒక క్లాస్మెట్ కుడా మిగలలా ,అమెరికా దెబ్బకి ).
మా రూమ్మెట్స్ ,నేను వెల్లిపొయాక ,రూం వెకేట్ చేసి వెల్లిపొయారు. కొత్త రుమ్మెట్ కుడా ఏప్రిల్ అఖరికి పెల్లి చెసుకొని వేల్లిపొతున్నాడు.వరల్డ్ కప్ మీద బాగానే ఆశలు వుండేవీ ,కాని నా కంటే ముందే మన వాళ్ళు వచ్చేస్తున్నారు . ఇంకా మిగిలిన వాళ్ళందరు కుడా వచ్చే సంవత్సరం H1 అంటున్నారు.
ఏంటో ,ఇండియా లో వుండి కుడా NRI లాగా బతకాల్సి వస్తుంది. అందుకె నేను NON -NRI.
(శ్ .... పెళ్ళికి ఇంకా టైం వుంది. మా ఇంట్లొ వాళ్ళెవరు ,ఈ బ్లాగు చదవరు లే )
P.S: ఈ టపా, నా ప్రోఫైల్ చూసి ,NON -NRI అంటే ఏమిటని అడిగిన వాల్లందరికోసం
2 Comments:
ఇండియా వెలుతున్నామన్న ఉత్సాహం నెల రోజుల ముందు నుండీ మన పనుల్లో కనిపిస్తుంది.అక్కడకి వెళ్ళాకా మీరన్నట్టే ఒక వారం,పది రోజుల్లో అన్ని పనులూ అయిపోతాయి.తిరగడానికి ఫ్రెండ్స్ లేక,ఇంట్లో కూర్చుని పిచ్చి టీవీ సీరియల్స్ చూడలేక కొద్ది కొద్దిగా బోర్ మొదలవుతుంది.ఇంకో వారం రోజుల్లో వెళ్ళిపోతున్నామనగా మళ్ళా సందడిగా వుంటుంది.ఆ సందడి చూసి అక్కడే వుండిపోవాలనిపిస్తుంది.బాధ గా,బెంగ గా తిరుగు ప్రయానం.మనం గమ్య స్తానానికి వచ్చేస్తాము గానీ మనసు అక్కడే మర్చిపోతాము.ఆ బాధ తాలూకూ నీరసం ఒక పదిహేను రోజులు మన పనుల్లో కనిపిస్తుంది.మల్లా అంతా మామూలే.మీ త్రిప్ అయ్యాకా రాసే టపా ఇలానే వుంటుందనుకుంటా.అందరికీ ఇది అనుభవమే.అన్నట్టు నాకు బైక్ మీద తిరగడం చాలా ఇష్టం.మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తెగ తిరిగేద్దామనుకున్నాను కానీ మావారు తిప్పలేదు.అక్కడ కూడా అద్దాలు మూసేసి డబ్బాలో కుర్చోపెట్టారు..వా.....
ఎంజోయ్ చెయ్యండి.క్షేమం గా వెళ్ళి ఆనందం గా తిరిగిరండి.
వావ్ భలే వివరణ. నీ పరిస్థితి అర్థమైంది బ్రదర్. మంచి మంచి పుస్తకాలతో స్నేహం కుదురుతుందేమో చూడు.
Post a Comment
<< Home