Monday, March 26, 2007

డే లైట్ (నో) సేవింగ్

ప్రొద్దున లేచేసరికి నా వాచ్ లో సమయం తొమ్మిది, కాని మా రూమ్మేట్ ఎమో పది అంటాడు. ఏంటి సంగతి అంటే డే లైట్ అన్నాడు. అంటే ఒక గంట నిద్ర పొయిందనమ్మట...

లాప్ టాప్ లో, సెల్ ఫొన్ లో ,ఒవేన్ లో ,హేటెర్స్ లో, వాచ్ ల లో టైము సెట్ చెయ్యడానికి ఒక అర్ద గంట పొయింది. Outlook లో మీటింగ్స్ (అమెరికన్ సర్వర్ లో వుంటది ) రీ శెడ్యుల్ చెయ్యడానికి ఇంకో అర్ద గంట ఫట్. సరెలె అని తొందరగ నిద్ర పొదాము అనుకుంటె ,కజిన్ నుండి ఫొన్ (అమెరికా లో రెండు వారల కిందటె మొదలు అయిందట) .. ఇంకో గంట పొయింది.


ఎవడికి సేవింగో తెలువదు కాని నాకు మాత్రం ముడు గంటలు బొక్క.

Labels:

7 Comments:

At Mon Mar 26, 06:50:00 AM GMT+5:30, Blogger రాధిక said...

ఈ టైము మార్చుకోవాల్సిన రెండు సార్లు నేను బోలెడు కంఫ్యూజ్ అయిపోతాను.ఒకసారి త్వరగా నిద్రపోవాల్సొస్తుంది.ఇంకోసారి త్వరగా నిద్ర లేవాల్సొస్తుంది.

 
At Mon Mar 26, 09:10:00 AM GMT+5:30, Blogger వీవెన్ said...

మాకిక్కడ ఈ సేవింగు లేకపోయినా అమెరికా వాళ్ళతో వ్యవహారాలు నడపడం వల్ల మాక్కూడా ఈ విషయంలో కొంత అయోమయం ఉంటూంటుంది.

అసలు దీన్ని విదేశాల్లోని మనవారు ఎలా సంభాళిస్తారో కూడా తెలుకోవాలనుకున్నాం. ముందుచూపు విహారి రాద్దామని అనుకునే ఉండాలే.

సరిగ్గా ఒకేసారి దేశంలోని ప్రజలందరూ సమయాన్ని ఎలా మార్చుకుంటారు?

సూర్యోదయాస్తమాలు కూడా ఒకరోజు లోనే గంట తేడాగా నడుస్తాయా?

పెద్దలకే ఇంత అయోమయంగా ఉంటే, ఇంక పిల్లల పరిస్థితి ఏంటి? నిన్నటి వరకు 7 గంటలకి లేచి 9 గంటలకి బడికెళ్ళినవాడు ఈరోజు నుండి 6 గంటలకే లేచి 8 కల్లా బడికెళ్శాలంటే ఎలా ఉంటుంది? స్కూలుకి పిల్లలందరూ అదే సమయానికి వస్తారా?

ఇక సమావేశాలు వాటి పరిస్థితి ఎలా ఉంటుంది?

 
At Mon Mar 26, 07:44:00 PM GMT+5:30, Blogger spandana said...

సుధాకర్ గారూ,
మీకు పిల్లలున్నారా?
ఎందుకడుగుతున్నానంటే ఈ day light savings వల్ల పొద్దు ఇంకా వుండగానే ఇంటికి వస్తాం. పిల్లలని అలా పార్కుకో, ఇంకో చోటికో తీసుకెళ్ళి పొద్దు మునగక ముందే ఇల్లు చేరుకోవచ్చు. ఇది నాకు నచ్చిన గొప్ప సంగతి ఈ day light saving వల్ల.
ఇక పొద్దుండగానే పని చక్కబెట్టుకొని ముందుగా పడుకుంటాం కాబట్టి ఓ గంట ముందుగా దీపాలు గట్రా ఆర్పేస్తాం గనుక విద్యుత్తు ఆదా! నామట్టుకు నాకు పిల్లలతో ఆడుకోవడం నచ్చింది ఈ ఆదా కంటె!

వీవెన్,
ఇక మీ ప్రశ్నల విషయానికి వస్తే...
ఇక్కడ ఈ సమయ మార్పిడి గురించి చిన్నప్పట్నుంచీ వింటున్నదే గనుక ఎవరికీ తెలియకుండా పోయే అవకాశం లేదు. అయితే గియితే మరిచిపోకుండా ఓ వారం ముందునుంచే TVలు రేడియోలు బాకా వాయిస్తూ వుంటాయి. ఈ మార్పు ఆదివారం తెల్లవారుఝామున 2గంటలకు జరుగుతుంది కావున ఒకవేళ మరిచిపోయినా మారిన TV టైమ్, రేడియో టైమ్, సెల్ ఫోన్ టైమ్ అన్నీ గుర్తు చేస్తాయి. ఇంకా హైవేల మీద సైన్ బోర్డుల మీద కుడా ఇదే సందేశం గుర్తు చేస్తూ వుంటుంది.

సుర్యోదస్తమయాలు మనం టైమ్ మార్చుకున్నామని మారవు గదా! అవి జరగాల్సిన సమయంలో అవి జరుగుతాయి. మనమే మన కార్యక్రమాలను ఒక గంట ముందుకు జరుపుకుంటాం అంతే!

పిల్లలకు కుదురుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి ముందురోజునుంచే మేము జాగ్రత్త పడతాం. (ముందుగా పడుకోబెట్టి).

సమావేశాలు అన్నీ పక్కాగా జరుగుతాయి. ఈ daylight savings నిజానికి ఏప్రిల్ మొదటి వారం నుండి మొదలవ్వాలి కానీ బుష్ గారు ఇంకా విద్యుత్ ఆదా చెద్దామని దాన్ని కాస్తా ఈ ఏడాది నుండి మార్చి రెండో వారం నుండీ మొదలవ్వాలని ఆజ్ఞాపించారు. అందువల్ల కొన్ని utilitiesలో manual గా time మార్చాల్సివచ్చింది. outlook దీన్ని గుర్తించకపోవడంతో అందులో మీటింగులన్నీ రద్దు చేసి మళ్ళీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది.


--ప్రసాద్
http://blog.charasala.com

 
At Mon Mar 26, 11:07:00 PM GMT+5:30, Blogger Sudhakar said...

రాధిక గారు:

నా కంప్యుజన్ గురుంచి ఇక్కడ చదవండి.

http://kaizen123.blogspot.com/2006/12/us-timezone.html

వీవెన్ గారు:

పిల్లల సంగతి ఎమో కాని ,రొజు ప్రొద్దున యెడు గంటలకి లెచి ,ఎనిమిది గంటలకి ఆఫిసు కి వెల్లే నాకు మాత్రం , ఈ రొజు ప్రొద్దున మాత్రం నిద్ర లెవబుద్ది కాలెదు.

ప్రసాద్ గారు:

"మీకు పిల్లలున్నారా?" అని అడిగారంటే ,పెల్లయిందని అజ్యుం చేసుకున్నారన్న మాట. ఇంకా ఒక్కసారి కుడా కాలేదండి.

వీవెన్ గారి ప్రశ్నలన్నిటికి సమాదానాలు చెప్పినందుకు దన్యవాదములు

 
At Tue Mar 27, 02:00:00 AM GMT+5:30, Blogger గిరి Giri said...

ప్రసాద్ గారు, బాగా చెప్పరు. కాని ఒక్క విషయం. ఇప్పుడు ఎలాగూ ఎనిమిది నెలలు సేవింగ్స్ టైం ఉంది కదా, మిగతా నాలుగునెలల్నీ వదిలేయడమెందుకని అడిగేవళ్ళు లేకపోలేదు (అందుకు కొన్ని పెద్ద కంపెనీలు లాబీ చేస్తున్నయట కూడ) . విద్యుత్తు ఆదా అవుతుందని ఖరాఖండిగా ఎవరు చెప్పలేరనేది కూడ తెలిసిన విషయం - షాప్పింగ్ కాంప్లెక్స్ లకూ, మాల్ కూ ఈ అదనపు సమయం లాభసాటి వ్యవహారమే. మరి వాళ్ళు కాల్చే విద్యుత్తు సంగతేమిటి?
బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ పాద్దతి గురించి రాసినప్పుడు కొవొత్తులు వాడేవారు - అప్పట్లో తొందరగా పని పూర్తి చేయడం వల్ల కొవ్వొత్తులు తప్పక ఆద అయ్యేవనుకుంటా..ఇప్పటి విద్యుత్తు ఆదా అనుమానమే..

 
At Tue Mar 27, 09:32:00 PM GMT+5:30, Blogger spandana said...

మరదే... పెళ్ళి అయినా... పిల్లలున్నా... ఈ దే లైట్ సేవింగ్ అంటే ఎందుకో ఏంటో తెలిసి వస్తుంది. :)
న మట్టుకు నాకూ విద్యుత్ ఆదా మీద నమ్మకం లేదు కానీ సాయంత్రాలు కుటుంబంతో గడపడం హాయిగా వుంటుంది అందుకు నాకిది నచ్చింది.
ఇక మిగతా నాలుగు నెలలంటారా? ఈ ప్రశ్న చాలా మందే వేస్తున్నారు. దాని వెనకాల ఏదో ఆద్యాత్మిక గూడుపుఠాణీ వుందని విన్నాను. నాకూ తెలియదు అసలు కారణం. ఆ నాలుగు నెలలూ ఎలాగూ పొద్దు నాలుగ్గంటలకే గుటుక్కుమంటుంది గనక ఓ గంట ముందుగా ఇంటికెళ్ళినా లాభమేం వుండదు.

దీనివల్ల షాపులకూ, మాల్లకూ లాభమంటారా? కొట్టు మూసేవరకూ కొట్లోనే వుంటాం తప్పితే కొట్టు వాడు కూడా కొత్త సమయం ప్రకారమే మూసేస్తాడు కదా? వాడు అదనంగా గాంట తెరిచివుంచడు కదా ఎక్కువ విద్యుత్ తాగడానికి?

--ప్రసాద్
http://blog.charasala.com

 
At Wed Mar 28, 01:04:00 AM GMT+5:30, Blogger Unknown said...

హమ్మయ్య ఇక్కడ డే లైట్ సేవింగ్స్ కాన్సెప్ట్ లేదు. లేకపోతే నేను పొద్దున్నే ఎనిమిదిన్నర, తొమ్మిదింటికల్లా లేవాల్సొచ్చేది.

 

Post a Comment

<< Home